Showing posts with label sri lanka broad casting. Show all posts
Showing posts with label sri lanka broad casting. Show all posts

Saturday, 20 July 2013

Meenakshi Ponnudurai - మధుర స్వరం: మీనాక్షి పొన్నుదురై


ఆఫిసు నుండి ఇంటికి నాకు ఒక గంట ప్రయాణం. రోజు ప్రొద్దున, సాయంత్రం కారులొ FM రేడియొలొ పాటలు వింటు ప్రయాణం సాగించడం పరిపాటాయిపోయింది. క్రొత్తవి, పాతవి, హింది, తెలుగు పాటలు వింటుంటాను. ఈ  మద్య వస్తున్న తెలుగు క్రొత్త పాటలు ఎంత కర్ణ కఠొరంగ వుంటున్నాయొ, అంతే కఠొరంగ వుంటున్నాయి రేడియొ జాకీల (RJ) గొంతు. చాలా మంది RJ లు శ్రోతలని చులకన చేస్తు  మాట్లడటం, మేము చాలా తెలివైన వాళ్లము, శ్రోతలు పని పాట లేకుండా ఫొన్ లు చేస్తారనె ధోరణి కనపడుతుంది. ఇంకొందరైతె అమ్మాయిలతొ చక్కగ మాట్లడతారు, అబ్బాయిలతొ అయితె సంభాషణ పెద్దగ చేయారు. శ్రోత  ఎవరైన సరె కుల్లు హాస్యాలు ఆడనీకి మాత్రం వెనకాడరు. ఒక్క మాటలొ చెప్పాలంటె ఘోరం అనె పదం ఒకటి చాలు, మిగత ఎంత రాసిన వృదా ప్రయాసె.

ఇలాంటి సమయాల్లొ నాకు బాగా గుర్తు వచ్చేది మీనాక్షి పొన్నుదురై గారు. కాస్త పాతతరం తెలుగు రేడియొ శ్రోతలకి ఈమె సుపరిచితురాలె. నా ఊహ తెలిసినప్పటినుంచి అంటె 1980 నుండి 1990 వరకు వీలు దొరికినప్పుడల్ల మద్యానం 2.00 నుంచి 3.30 వరకు శ్రీ లంక బ్రాడ్ కాస్టింగ్ (SLBC/ సిలోన్ రేడియొ అని కూడ అనేవారు) వారు ప్రసారం చేసె తెలుగు కార్యక్రమలు వినేవాడిని. అందులొ మీనాక్షి గారు తెలుగు కార్యక్రమాల అనౌన్సర్. ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే, అయినా ప్రయత్నిస్తాను.

మీనాక్షి గారిది మధురమైన గొంతు, అసలు ఆమె వేసె పాటల కన్న ఆమె మాటలె ఇష్టం. ఆమె అద్బుతమైన కంఠం ఒక్కటే కారణం కాదు, ఆమె మాటల్లొ వుండే ప్రేమ, ఆత్మీయత వర్ణించలేనిది. ఆమె మాట్లడుతుంటే, నేను రేడియొ లొకి దూరి ఆమె దగ్గరె కూర్చుని పెదరాశి పెద్దమ్మ కధలు చెబుతుంటె పిల్లలు ఎలా వినేవారొ అలా ముగ్దుడనై వింటు వుండి పోయె వాన్ని. నాకు ఎంత ఇష్టమంటె వారం పొడుగున ఎప్పుడు ఏ కార్యక్రమం వస్తుందొ ఒక డైరి లొ రాసుకున్న ఒక సారి. క్రింద పట్టికలొ సరదాగ ఇస్తున్నాను.

సోమవారం: భక్తిరంజని, చిత్రలహరి, అక్షరమాలిక, గానామృతం.
మంగళవారం: గానసుధ, వాయ్స్ ఆఫ్ ట్రూత్, ముత్యాలపందిరి.
బుధవారం: శబ్దలహరి, గానతరంగిణి, బృందగానం, గానామృతం, నా అభిష్టం.
గురువారం: నేటి జంట, వాయ్స్ ఆఫ్ ట్రూత్, సంగీత వాహిని, ప్రేమ వాణి.
శుక్రవారం: చిత్రగానం, వాయ్స్ ఆఫ్ ట్రూత్, గానలహరి, ప్రేమవాని.
శనివారం: మీరు కోరిన పాటలు, వాయ్స్ ఆఫ్ ట్రూత్, మన్నా వర్తమానాలు, అమృతవాణి.
ఆదివారం: అక్షరమాలిక, వాయ్స్ ఆఫ్ ట్రూత్,  మీరు కోరిన పాటలు, క్రీస్తు స్తుతి.

వీటిల్లొ కొన్నింటిని ఇప్పుడు FM రేడియొలలొ కూడా నఖలు చేసారు. వివిద భారతిలొ వచ్చె హరివిల్లు కార్యక్రమం వీటి నుంచే ప్రేరణ పొందిందని చెప్పచు.

"లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్" అనె పదం బాగ వాడడం గుర్తు, అలాగే మను చరిత్రం, అబ్బాయి అమ్మాయిల మద్య స్నేహాలు, గొడవలు గురించి చెప్పేది. ఆమెకు తరచుగ రాసె ఒక శ్రోత టి. ఐ. జి. ప్రేమ కుమార్
ఉత్తరం చిరునామతొ సహా చదివేది. నేను ఉండబట్టలేక ఒక సారి ప్రేమ కుమర్ గారి చిరునామ రాసుకుని, ఉత్తరం కూడ రాసాను. కొన్నాళ్లకి అతను ప్రత్యుత్తరం రాసారు. తెలుగులొ అంత చక్కని దస్తురి నేనింత వరకు చూడలేదు. అతను వయసులొ నాకంటె చాలా పెద్దవాడు కావడంతొ మా స్నేహం ఒకటి రెండు ఉత్తరాలకె పరిమితమయింది. ఆలాగె వీలుంటే శ్రీ లంక కి వెళ్లి ఆమెని కలవాలానే కోరిక బలంగ వుండేది. కాని ఇంకా విద్యార్ది దశలోనె వుండెవాడిని కాబట్టి ఆ కోరికని మనసులోనె దాచుకున్నాను. ఇదంత ఎందుకు చెబుతున్నానంటె మీనాక్షి గారి మధుర స్వరం నన్ను అంతగ ప్రభావితం చేసింది.

కొన్ని పాటలు వేయడంలొ మీనాక్షి గారి ముద్రణ కనపడేది. ఆవి ఏ ఇతర రేడియోలలో వచ్చేవి కావు. మచ్చుకి ఒకటి -  నవమొహిని చిత్రంలొ - 'సుందర రూపం, చందన దీపం' అనె పాట నేను మరే స్టేషన్లో వినలేదు ఒక్క సిలోన్ రేడియోలొ తప్ప. ఆలాగె ఒకోసారి సినిమా చిత్ర కధనాన్ని కూడ ప్రసారం చేసెవారు.

ఇంకొక మధుర జ్ఞాపకం ఏమిటంటె ఒక సారి మీనాక్షి గారు ఒక పాట అనౌన్స్ చేసి ఇంకొ పాట వేసారు, వెంటనె తప్పు తెలుసుకుని వేరె పాట వేసారు, అది కూడ అనౌన్స్ చేసిన పాట కాదు. అప్పుడు మీనాక్షి గారు ఏ మాత్రం తడబడకుండ  -  'ఏంటి ఏమయింది ఈమెకు అనుకుంటున్నారా? మరి పరిగెత్తి పరిగెత్తి రికార్డ్ లను పట్టుకొచ్చి వెయ్యడంలొ ఒకోసారి ఇలా జరుగుతుంది ' అని మన ఇంట్లొ మనిషితొ ఎలా మాట్లడాతారొ అలా ఆట్లాడింది. ఆ తరువాత సరి అయిన పాట వేసారులెండి.

బెర్హంపూర్, ఒరిస్సా  నుండి చాలా ఉత్తరాలు వచ్చేవి. ఒకో సారి శ్రోతల నుంచి ఉత్తరాలు రావట్లేదని చాలా బాధపడేది. " ఇంకెన్ని రోజులు నేను త్వరలొ రిటైర్ అయిపోతున్నాను, ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టనులె" అని కూడ ఉడుక్కునేది. ఇలా ఎన్నెన్నొ మధుర జ్ఞాపకాలు. అలాగె తెలుగు కార్యక్రమలు ముగించినాక వచ్చె "నమస్తె కైవలి" అనే మళయాల కార్యక్రమాల ఆరంబ పాట, "లతిఖా" అని అనౌన్సర్ ని  పిలవడం ఇప్పటికి మరవలేను.

అంతర్జాలంలొ ఆమె గురించి చాలా శోధించాను, ఆ మధుర కంఠం ఎవరన్న రికార్డ్ చేసి పెట్టరేమోనని, కనీసం ఆమె ముఖ చిత్రం అయిన దొరుకుతుందేమొనని. కాని నా ఆశ నెరవేరలేదు.  అయితె ఆమె మరనించిందన్న వార్త మాత్రం దొరికింది.
 "On 22.07.2001, that last working day in her life, before she left Studio No. 9 at the SLBC, she reminded listeners of her tryst on the following day to speak on the matinee idol and great Thespian, Shivaji Ganeshan. Sadly, she never made it. At nine o’clock on the following morn, she peacefully passed on in her mid-seventies"
Mrs T. S. Sameer, Kannada announcer, SLBC.

నేను మరి కొంత మంది మంచి రేడియో అనౌన్సర్ లని విన్నాను - వారిలొ హైదరబాద్ రేడియో స్టేషన్లొ కార్మికుల కార్యక్రమంలొ వచ్చే చిన్నక్క, ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం నిర్వహించె కె. విజయ, బిగ్ ఎఫ్. ఎం లొ వచ్చె నీలేష్ మిశ్రా (యాదొన్ క ఇడియట్ బాక్స్), బినాకా గీత్ మాల అమీన్ సయాని, తబస్సుం లాంటి పెర్లు కొన్ని. వీళ్లందరివి కూడ మంచి గొంతులు, కాని మీనాక్షి గారిలోని వున్నంత ఆత్మీయత వుండదు. 

మీనాక్షి గారు - మళ్లి జన్మంటు వుంటె మరల మా అందరికి చేరువ అవ్వరు!