ఈ బ్లాగులొ నా చిన్న నాటి
జ్ఞాపకాలలొ భాగమయిన,
కుక్కల పెంపకం గురించి చెప్పదలుచుకున్నాను. నేనేమి కుక్కలని కొని పెంచిన రకం
కాదు,అంత స్తోమత కూడా
ఉండేది కాదు . ఏదో ఇంటి దగ్గర
తిరిగె వీధి కుక్కలని మచ్చిక
చేసుకుని కొద్ది సేపు ఆడుకునె వాన్ని
అంతే. ఆయిన అవి నాకు
మధుర జ్ఞాపకాలను మిగిల్చాయి.
అవి నేను ఏడొ తరగతి,
అంటే 1983 సంవత్సరంలొ, చిత్తూరులొ వుండెవాళ్లము. మా ఇంటి దగ్గర
గర్భినిగ వున్న ఒక కుక్క
ఇంటి ముందు తిరుగుతు వుండేది.
దానితొ ముఖ: పరిచయం తప్ప
పెద్దగ పట్టించుకునే వాన్ని కాదు. ఒక రోజు
జోరుగ వర్షం కురుస్తుంది. ఆ
కుక్క మా ఇంటి ప్రక్కన
ఉన్న ఖాలి స్థలం
లోకి వచ్చి ఒక మూలన
కూర్చుని పిల్లల్ని కనింది. చిన్న చిన్న కుక్క
పిల్లల అరుపులు నా చెవిన పడ్డాయి.
పెరటి తలుపు దగ్గరికి వెళ్లి
చూస్తె జోరుగ కురుస్తున్న వానలొ
ఆ తల్లి కుక్క తన
పిల్లలని వానకి కాపాడలేక నిస్సహయంగ
వుంది. ఆ దృశ్యం చూసిన
నాకు బాధేసింది. ఎలా ఆ కుక్కని, చిన్న
పిల్లల్ని కాపాడాలా అని. కాని దగ్గరకి
వెళ్లాలంటె భయం, కరుస్తుందేమొనని. అసలె
పిల్లల్ని పెట్టింది, కోపంలొ వుండచ్చు కూడ, పైగ నేను దాని
పిల్లల దగ్గరకి రావడం దానికి
ఇష్టమొ లేదొ కూడ తెలియదు.
అలాగని వూరుకుండిపోనీకి నా మనసు ఒప్పుకోలేదు.
ఏదొ ఒకటి చేయాలి అని
చుట్టూ ప్రక్కల చూసాను - మా ఇంటి ప్రక్కన
ఒక ఖాలి స్థలంలొ
కొన్ని ఇటుకలు పడి వున్నాయి,
కాని ఇటుకలు తీసుకుని కుక్కకి ఇల్లు కట్టాలంటే దాని
దగ్గరకి వెళ్లాలి, మరల భయం. వాన ఇప్పట్లొ తగ్గెలా
లేదు, ఇంక లాభం లేదు
అనుకుని ముందు తల్లి కుక్కని
మచ్చిక చేసుకోవాలని ఒక పెద్ద అన్నం
ముద్ద తీసుకుని దానికి చూపిస్తు దాని దగ్గరకి వెళ్లి
ముందర పెట్టా. అంత పెద్ద ముద్దని
అది ఒకే సారి నోట్లొ
వేసుకుంది. తర్వాత దానిని కాస్త భయంగ దువ్వాను,
అది అన్నం
తినడంలొ నిమగ్నమయి వుంది. ఇదే మంచి అవకాశం
అని దబ దబా ఇటుకలు
తెచ్చి దాని చుట్టు పేర్చాను.
ఒక అట్ట ముక్కతొ ఆ
ఇటుకల మీద కప్పి, గాలికి
ఎగిరిపొకుండ రాళ్లతో కప్పాను. ఇప్పుడు తల్లి,
పిల్ల కుక్కలు వానకి తడవటం లేదు.
ఇదంత చేస్తున్నప్పుడు తల్లి కుక్క నన్ను
ఏమి అనలేదు, దాంతో కాస్త ధైర్యం
వచ్చి చిన్న కుక్క పిల్లలని
తదిమాను. తల్లి కుక్క ఏమి
అనలేదు. మొత్తం 6 కుక్కలని కనింది. కొన్ని పెద్దవి, కొన్ని మద్యస్తంగా, ఇంకొన్ని చిన్న సైజులొ వున్నాయి.
అప్పటికే వానాలొ పూర్తిగ తడిసిపోయాను నేను, అయిన ఆ
కుక్క పిల్లలను చూస్తె భలే
అనందం వేసింది. అప్పుడే పుట్టిన
పిల్లలకి, తల్లికి మద్య నేనెందుకని ఎక్కువ
సేపు అక్కడ వుండకుండ ఇంట్లొకి
వచ్చేసాను .మా అమ్మ, రెండొ
అన్నయ్య ఇదంత మౌనంగ గమనించారు.
ఆ తర్వాత వాన తగ్గిపోయింది, కుక్క
దాని పిల్లలు ఒక మూడు రోజులు
ఆ ఖాలి స్థలం లోనె
వున్నాయి. నేను తల్లి కుక్కకి
ఒక ముద్ద అన్నం పడేసి,
చిన్న కుక్కలను వళ్లొ తీసుకుని ఆడుకునే
వాన్ని.
నాకు
ఆ కుక్క పిల్లలలో ఒక
కుక్క భలే నచ్చింది. ఆన్నిటికన్న
దృడంగ, గోదుమ,
నలుపు రంగులతొ అందంగ వుండేది. దానికి
నా దగ్గర ప్రత్యేక అతిధి
మర్యదలు లభించేటివి - అంటే
పాలు, బిస్కెట్లు
అలా అన్న
మాట. స్వల్ప
కాలం లోనే మా ఇద్దరికి
మంచి స్నేహం ఎర్పడింది. దానికి ఒక పేరు పెట్టాలనుకున్న
- ఎం పేరు పెట్టాల అని
అలోచించాను. అప్పుడే మన భారత క్రికెట్
జట్టు ప్రపంచ కప్ సాదించింధి. కపిల్
దేవ్ పెద్ద హీరొ
అయిపొయాడు. కపిల్ దేవ్ కూడ
దృడంగ బలంగ వుండేవాడు కాబట్టి
దానికి కపిల్ దెవ్ అని
పేరు పెట్టేసా. ఈ పేరు పెట్టడం
పూర్తిగ కపిల్ దేవ్ పై
నా అభిమానమే తప్ప మరే ఉద్దేశము
కాదని స్రోతలకు మనవి.
కపిల్
దేవ్ సాధారణమయిన కుక్క అయితె కాదు,
చాలా తెలివి గలది. ఎవరితొ ఎప్పుడు
ఎక్కడ ఎలా వుండాలొ దానికి
పుట్టినప్పటినుండె అలవడింది. ఎలా అంటే మా
నాన్న దానిని పెద్దగ పట్టించుకునెవాడు కాదు, చెప్పాలంటె లొపలికి
రానిచ్చె వాడు కాదు. ఒక
రోజు మా నాన్న వరండాలో
మా రెండో అన్నకి చదువు
చెబుతున్నాడు. నేల మీద చాప
వేసి క్రిందనే కూర్చుని చదువు చెప్పడం మా
ఇంట్లొ ఆనవాయితి. వారి చదువు కొనసాగుతున్నపుడు
కపిల్ దేవ్ అక్కడికి వచ్చాడు
(అది మగ కుక్కనే). మా
నాన్న దానిని చూసి -" ఈ గబ్బుది ఇక్కడికెందుకు
వచ్చిందీ అని ' హై
హై' అని
హడలించాడు. కాని కపిల్ దేవ్
ఏ మాత్రం తడబడకుండ
మా నాన్న దగ్గరికి వచ్చి
వళ్లొ కూర్చుంది. ' ఆ! ఎం ఇది
చెప్పిన వినకుండ వచ్చింది ' అని చిన్నగ దానిని
వళ్లొనే కూర్చొబెట్టుకుని మిగత చదువు కానిచ్చరు.
టైగర్ లాంటి మా నాన్నని
కూడ కపిల్ దేవ్ బుట్టలొ
వేసుకుంది.
ఒక రోజు కపిల్ దేవ్
తొ ఆడుకుంటుంటె అది బయటికి వెళ్లిపోవాలని
చూసింది, దానిని పోనియ్యకుండ నేను తలుపు వేసాను.
అది తలుపు దగ్గర దీనంగ
అరిచింది పంపియమని, అయిన నేను దానిని
వదలదలుచుకోలెదు. ఎత్తుకుంటె దిగి పొయి తలుపు
దగ్గరకి వెళ్లి అరిచింది. నేను ఎంతకి తలుపు
తీయక పోవడంతొ అది ఒక మూలకి
వెళ్లి మల విసర్జన చేసింది.
నాకు అప్పుడు అర్దమయింది అది ఎందుకు
అలా అరిచిందొ. దాని క్రమశిక్షణ నాకు
ముద్దేసింది. ఇప్పుడైతే కుక్కలకి బయటికి వెళ్లి మల మూత్ర విసర్జన
చేసే ట్రెయినింగ్ ఇస్తారు. అలాంటిది ఎటు వంటి ట్రెయినింగ్
లేకుండ కపిల్ దేవ్ కి
ఆ అలవాటు అబ్బింది.
నేను
స్కూల్ నుంచి రాగనే కపిల్
దేవ్ తొ చక్కాగ ఆడుకునేవాన్ని.నా కోసం అది
మా బావి గట్టు దగ్గర
ఎదురు చూస్తు వుండేది. ఇంట్లొ అందరికి కూడ అది ఎంతొ
ఇష్టమయిపోయింది. రెండు నెలలు గడిచాయి,
మా స్నేహం
రోజు రోజుకి బలపడింది. ఆ క్రమంలో ఒక
రోజు నేను స్కూల్ నుంచి
వచ్చెసరికి కపిల్ దేవ్ నీరశంగ
బావి దగ్గర పడుకుని వుంది.
నన్ను చూసి ఎక్కడ లేని
ఓపిక తెచ్చుకుని నా దగ్గరకు వచ్చి
నన్ను నాకింది. తర్వత బావి గట్టు
దగ్గరకి వెళ్లి మూత్ర విసర్జన చేసింది.
దాని మూత్రం ఎర్రగ వుండడంతొ నాకు
దానికి వంట్లొ బాగోలేదని అర్దమయ్యింది. తరువాత అది మరల నా
దగ్గరకి వచ్చి నా వళ్లొ
ప్రాణాలను కోల్పొయింది. నాకు దుఖము, బాధతొ
ఎం చేయాలొ కూడ
అర్దం కాలేదు. క్రితం రోజు వరకు చలాకిగా
వున్న కుక్క అలా నా
ముందె ప్రాణాలు వదిలేయడం నాకు పెద్ద ఆశ్చర్యాన్ని
మిగిల్చింది.
నేను
బాధగ మా అన్నకి చేప్పాను.
ఆ తర్వత మిగత కార్యక్రమాలన్ని
మా అన్నె చూసుకున్నాడు. ఆ
బాధ నుంచి కోలుకోవడానీకి కొన్ని
రోజులు పట్టింది.
ఆ తర్వాత మాకు కడప జిల్లాకు
బదిలి అయ్యింది. మేము అందరము క్రొత్త
ప్రాంతానికి మకాం మార్చాము. మేము
ఒక నాలిగిళ్ల చావడిలో వుండేవాళ్లము. కొంత కాలానికి మా
చావిడి దగ్గర ఒక కుక్క పిల్లలను
పెట్టింది. తల్లి కుక్కని పాత
పద్దతి లోనె మచ్చిక చేసుకుని
పిల్లలతొ ఆడుకునే వాని. అయితె ఈ
కుక్క పిల్లలో నాకు పెద్ద్గగా నచ్చిన
కుక్క పిల్లలు లేవు. అయిన ఒక
కుక్క పిల్లతొ దొస్తి చేసుకుందామని అనుకున్నాను. ఆ కుక్క పిల్లలొ
ఒక దానికి ఇరువై గొర్లు వున్నాయి.
మాములుగ కుక్కలకి పద్దెనిమిదే వుంటాయి. చుట్టు ప్రక్కల వారిని ఇది ఎందుకు ఇలా
అని అడిగితే -' ఇరువై గొర్ల కుక్క
ఇంటికి మంచిది, పద్దెనిమిది గొర్ల కుక్క పంట
చేలుకి మంచిదనీ’ చెప్పారు. సరే మనకుండేది ఇళ్లె
కద అని దానిని ఎన్నిక
చేసుకున్న.
ఇప్పుడు దానికోక పేరు పెట్టాలి, ఈ
సారి కూడ పెద్ద కష్టం
ఏమి కలగలేదు. అప్పట్లొ (1990s అనుకుంట) కొన్ని సినిమాలలో 'మోతీ అనే కుక్క
బాగ వచ్చేది. హింది సినిమాలయిన 'మర్ద్
', 'బోల్ రాధ బోల్ ', తెలుగులో
'నమ్మిన బంటు' లాంటి హిట్
సినిమాలతొ బాగ పేరు తెచ్చుకుంది.
ఇంకేం అదే పేరు పెట్టుకుని
పిలిచేవాన్ని.
అయితే
ఇది కపిల్ దేవ్ కి
పూర్తిగ భిన్నమయిన కుక్క. మోతి అని ఎన్ని
సార్లు పిలిచిన నన్ను కాదన్నట్టు వుండేది.
కొన్ని నెలలకి బాగనే పెద్దగయింది. కాని
దానిది పీల పర్సనాలిటీనే. అతి
కష్టం మీద కొన్ని అలవాట్లు
నేర్పాలని చూసా. ఒక కర్ర
పెట్టి దాని మీద నుంచి
దూక మంటే దూకేది కాదు.
కింది నుంచి వెళ్లిపోయెది, లేద
నా కోసం ఇక తప్పదని
గెంతేది. గిన్నెలో అన్నం పెట్టి నేను
తినమని
చెప్పెంత వరకు తినకుండ చేయాలని
ప్రయత్నించా, కాని లాభం లేకుండ
పోయింది. మా
ఇంట్లొ మాత్రమే మేము తినమని అనప్పుడు
తినేది, మిగత వాళ్ల ఇంట్లొ
మాత్రం అలాంటి మొహమాటలు ఏమి పెట్టుకునేది కాదు.
ఇవే కాకుండ ఇంకా చాలా చిత్రాలు
చేసేది. కుక్కలను కట్టేసే అలవాటు నాకు వుండేది కాదు,
అది వాటి స్వెచ్చకు భంగం
అని నా అభిప్రాయం. అలా
అది బయటకి బలదూర్ గా
తిరిగి ఇంటికి చేరుకునేది. ఒకోసారి బూట్లు వేసుకుని వచ్చేది. బూట్లంటె మనం వేసుకునేటివి కావు.
బయట బురదలో తిరిగి వచ్చేది. ఆ నల్లని బురద
కాళ్లకు బూట్ల లాగ కనపడేవి. ఫ్రెష్గ
బూట్లు వేసుకుని వస్తే ఇంట్లొ నేలకు
అచ్చులు కూడ పడేది. అలాంటప్పుడు
తిట్టి పంపేసేవాళ్లము. అది ఇంకా రెచ్చి
పోయి ఒకో సారి లాంగ్
బూట్లు లేద సూటు బూటుతో
వచ్చేది.
ఒకో సారి మా నాలుగిల్ల
చావిడి ఇల్లలొ దూరి ఏమన్న దొరికితె తినేసేది.
ఒక సారి వారితొ పాటు
సినిమాకి కూడ వచ్చి హాలు
లొ దూరి వారితొ పాటే
సినిమా అయ్యెంత వరకు వుండి తిరిగి
వచ్చింది.
ఇలా చాల రోజులే గడిచాయి. కొన్నాళ్లకు మేము ఇళ్లు మారి ఇంకొక చోటికి వెళ్లాము. ఆ తర్వత ఆ ఇల్లు నచ్చక ఇంతకు ముందు వుండే వీధిలోకే వచ్చాము. మోతి ఎప్పుడన్న కనపడెడి, కాని పెద్దగ పట్టించుకునే వాన్ని కాదు. ఆ తర్వత నేను హైదరాబాద్ కి మకాం మార్చేసా. మోతి ఎలా వుందొ ఏమయిందొ తెలీదు.